యూపీలో పెళ్లి బృందానికి రాళ్ల దెబ్బలు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలో ఓ పెళ్లి బృందంపై రాళ్ల దాడి జరిగింది. దళితవర్గానికి చెందిన పెళ్లి వాళ్లు ఫిరోజ్ పూర్ నుంచి బయలుదేరి సోన్ టా గ్రామానికి చేరుకున్నారు. బస్సులో పాటలు వింటూ ఉత్సాహంగా సోన్ టా చేరుకున్న వారికి స్థానికులు అడ్డుతగిలారు. పాటలు నిలిపివేయాలని అన్నారు. అయితే, పెళ్లి బృందం అదేమీ పట్టించుకోకుండా పాటలతో హుషారెత్తించింది. అనంతరం, వారు పెళ్లి ముగిసిన తర్వాత తిరుగుప్రయాణం కాగా, గ్రామస్థులు వారికి రాళ్ల దెబ్బలు రుచిచూపించారు. బస్సులోని యువకులపై దాడికి దిగారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.